టూరిజం ప్రమోషన్ కోసం వీడియో..‘తెలంగాణ ఏ వెయిట్స్ యూ’ పేరుతో రూప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్పన

హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో టూరిజం ప్రమోష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ కోసం రూపొందించిన ప్రచార వీడియో (ఆడియో విజువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్–ఏవీ)ను పర్యాట క శాఖ గురువారం విడుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల చేసింది. స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైన ప్రకృతి అందాలు, వారసత్వ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టడాలను ఈ వీడియోలో పొందుపర్చారు. ‘తెలంగాణ ఏ వెయిట్స్ యూ’ పేరుతో రూపొందించి న 58 సెక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ల నిడివి గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఈ  ప్రమోష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడి యోలో జోడే ఘాట్ లోయ, నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుమ్రంభీం ప్రాజెక్ట్, ఎస్ఆర్ ఎస్పీ (నందిపేట) బ్యాక్ వాటర్స్, ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో పొందిన రామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్ప ఆల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యం, ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూటీవో)తో  బెస్ట్ టూరిజం విలేజ్ గా గుర్తింపు పొందిన  భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోచంపల్లి, యాద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరిగుట్ట ఆల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యం, ఘణపురం కోటగుళ్లు, పాండవుల గుట్ట, నాగార్జునసాగర్, ఘణపురం చెరువు వంటి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యాట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క ప్రదేశాలున్నాయి.